Sampath Nandi father Nandi kishtayya passed away
Sampath Nandi : టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Sivaji Raja : నటికి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా.. తీసుకెళ్లి ఏకంగా శివాజీ రాజా భార్యకు చూపించి..
టాలీవుడ్‌లో దర్శకుడిగా సంపత్ నంది మంచి పేరు తెచ్చుకున్నాడు. రామ్‌చరణ్‌తో రచ్చ, గోపీచంద్‌తో గౌతమ్ నందా, సీటీమార్, మాస్ మహరాజ రవితేజతో బెంగాల్ టైగర్, వంటి చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా భోగి అనే చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.