Sampoornesh Babu Coming with Sodara Movie Release Date Announced
Sampoornesh Babu : హీరోగా సంపూర్ణేష్ బాబు పలు సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించాడు. మధ్యమధ్యలో పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్, టీవీ షోలలో కూడా కనిపించాడు. చిన్న గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా వస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు మెయిన్ లీడ్ లో ‘సోదరా’ అనే సినిమాతో రాబోతున్నాడు.
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘సోదరా’ సినిమాతో రాబోతున్నారు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చంద్ర చగంలా నిర్మాణంలో మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ చేయనున్నారు.
రిలీజ్ డేట్ అనౌన్న్ చేసిన సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్న సినిమా సోదరా. తెలుగు పరిశ్రమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరి బంధాన్ని అద్దం పట్టేలా ఈ సోదరా ఉంటుంది. వేసవిలో సోదరా సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు అని తెలిపారు.