దాడిచేసిన కవితా రెడ్డిపై హీరోయిన్ Samyuktha Hegde పోలీసులకు ఫిర్యాదు..

  • Publish Date - September 6, 2020 / 04:01 PM IST

Samyuktha’s Athleisure Outfit : బెంగళూరులోని ఆగ్రా లేక్ పబ్లిక్ పార్కులో వర్కౌట్లు చేస్తున్న కన్నడ భామ, ‘కిర్రాక్ పార్టీ’ ఫేం సంయుక్త హెగ్డేపై సామాజికవేత్త కవితారెడ్డి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హీరోయిన్ సంయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తనతో పాటు తన స్నేహితులపై దాడిచేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.



పార్కులో సంయుక్త హెగ్డేపై తన స్నేహితులతో కలిసి వర్కౌట్లు చేస్తోంది. అదే సమయంలో అక్కడి వాకింగ్ చేయడానికి వచ్చిన కవితా రెడ్డి సంయుక్తపై మండిపడింది.. పబ్లిక్ తిరిగే ప్రదేశంలో స్పోర్ట్స్ బ్రాతో వర్కౌట్లతో చేయడాన్ని సంయుక్తాను కవితా రెడ్డి తప్పుబట్టింది. దీనికి పార్కులోని వాళ్లు కూడా సంయుక్త బ్రాతో వర్కౌట్లు చేయడాన్ని తప్పుబట్టారు..

ఇదే విషయాన్ని సంయుక్త తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా చెప్పింది. దీనికి సంబంధించి వీడియోను కూడా ఇన్ స్టాలో వదిలింది. ఈ వీడియో ఆధారంగా తనపై దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని సంయుక్త డిమాండ్ చేశారు. కోపంతో ఊగిపోయిన సంయుక్త ఓ సెల్ఫీ వీడియోలో ఫైర్ అయింది. తాను వర్కవుట్ చేయడానికి వేసుకున్న లో- దుస్తులను పబ్లిక్‌‌గానే టాప్ తీసి చూపించింది.



దాడి చేసిన మహిళతో పాటు ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2, నిఖిల్ కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల్లో సంయుక్త హేగ్డే నటించింది.