Samyuktha Menon special gift to virupaksha director Karthik Dandu
Samyuktha Menon : హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇటీవల విరూపాక్ష(Virupaksha) సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంయుక్త మీనన్(Samyuktha Menon) ఇందులో హీరోయిన్ గా నటించగా కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్స్ లో ప్రేక్షకులని భయపెట్టి సస్పెన్స్, థ్రిల్లింగ్, ట్విస్టులతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.
థియేటర్స్ లో సినిమా చూసిన వాళ్ళు భయపడ్డాం, థియేటర్ అనుభూతి మాములుగా లేదు, ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో భయపెట్టిన సినిమా ఏది రాలేదు అని అంటున్నారు. సినిమా రిలీజయి వారం రోజులు అవుతున్నా ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ రన్ నడుస్తోంది. ఇప్పటికే విరూపాక్ష సినిమా దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి సాయి ధరమ్ తేజ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక సినిమాలో సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి. సంయుక్త యాక్టింగ్ కి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. విరూపాక్ష సినిమాతో సంయుక్తకు కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో సంయుక్త మీనన్ డైరెక్టర్ కార్తీక్ దండుకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.
Agent Twitter Review : మిక్స్‌డ్ టాక్.. ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. ఈ సారన్నా అయ్యగారు హిట్ కొడతారా?
విరూపాక్ష సినిమా మొదటి రోజు చిత్రయూనిట్ థియేటర్స్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లారు. మొదటి రోజు కావడంతో థియేటర్స్ లో మంచి హంగామాగా ఉంది. ఆ హడావిడిలో డైరెక్టర్ ఫోన్ పోయింది. ఈ విషయం డైరెక్టర్ మీడియాకు కూడా తెలిపారు. తాజాగా సంయుక్త మీనన్ డైరెక్టర్ కార్తీక్ దండుకి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చింది. దీనిపై సంయుక్త మీనన్ తన సన్నిహితులతో చెప్తూ.. సినిమా రిలీజయినప్పుడు డైరెక్టర్ ఫోన్ పోయిందని చాలా బాధపడ్డాను. నేను ఎలాగో నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. అందుకే ఫోన్ ని ఇచ్చాను అని తెలిపిందట.