Sandeep Reddy Vanga : నేషనల్ అవార్డులపై సందీప్ వంగా కామెంట్స్.. ఆ హీరోలకు ఎందుకు రాలేదు..

అల్లు అర్జున్ కి వచ్చిన నేషనల్ అవార్డు గురించి సందీప్ వంగా వైరల్ కామెంట్స్ చేశారు.

Sandeep Reddy Vanga : దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు. సందీప్ వంగా రీసెంట్ గా ఓ తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ సందీప్ ఏమన్నారు..?

అల్లు అర్జున్ కి వచ్చిన నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతూ.. అందుకు సంతోష పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ 69 ఏళ్లలో ఆ అవార్డు ఎందుకు రాలేదు, అంతకుముందు హీరోలకు నేషనల్ అవార్డు ఎందుకు ఇవ్వలేదని సందేహం వ్యక్తం చేశారు. బహుశా మనవాళ్ళు నేషనల్ అవార్డుని లైట్ తీసుకోని ఉండి ఉంటారని, దానికి సరిగా అప్లై చేసి ఉండరని సందీప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సందీప్ వంగా, అల్లు అర్జున్ కాంబినేషన్ లు కూడా ఒక సినిమా రాబోతుంది.

Also read : Salaar : సలార్ నుంచి క్రేజ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. కానీ బ్యాడ్ న్యూస్..

యానిమల్ మూవీ తరువాత సందీప్ వంగా, ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. 2025లో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ తరువాత అల్లు అర్జున్ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఆ మూవీ 2025 చివరిలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. బన్నీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్.. సందీప్ తో సినిమా మొదలు పెట్టేలోపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు