Sandeep Reddy Vanga : ఎవరెవరివో సినిమాలు చూస్తున్నారు.. ఈ సినిమా చూడండి.. నిర్మాత నా LKG దోస్త్..

జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga : కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్.. కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకరటించనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గెస్ట్ గా వచ్చాడు.

జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నుండి ఫ్రెండ్. నాకు చెప్తే నేను సినిమా ప్రొడ్యూస్ చేయొద్దు అంతనుఅని చెప్పకుండా స్టార్ట్ పెట్టిండు. యానిమల్ షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే గోవాలో ఒక షెడ్యూల్ అయిపొయింది అంటే నేను ఫోన్లోనే తిట్టిన. కానీ యానిమల్ షూట్ గ్యాప్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు విజువల్స్ చూపిస్తే అవి చాలా బాగున్నాయి, కొన్ని సీన్లు చూసిన చాలా బాగుంది కామెడీ. డైరెక్టర్ హరీష్ బాగా రాసిండు. టీజర్ లో కొంచెం తక్కువనే ఉంది కామెడీ ఇంకా సినిమాలో చాలా ఎక్కువ ఉంటుందనిపిస్తుంది నాకు.

Also Read : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లు? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?

అందరు హార్డ్ వర్క్ చేస్తారు బట్ ఇది వేరే రకమైన హార్డ్ వర్క్. రిలీజ్ అయ్యి హిట్ అయినాక చెప్పుకుంటారు వీళ్ళు. వీళ్ళు గోవాలో సూట్ చేస్తున్నప్పుడు పోలీసు పట్టుకున్నవి, మహారాష్ట్ర బోర్డర్లో షూట్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నవి అవన్నీ బయటకు వస్తాయి తర్వాత. అవన్నీ విన్నాక అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు అని, ఎవరెవరివో సినిమాలు చూస్తున్నారు కదా మన తెలుగోళ్ళే హీరోలందరూ వచ్చి చూడండి అని అన్నారు.

 

Also Read : NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే.. వార్ 2లో ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ టాక్ ఇదే..