Sandeep Reddy Vanga comments about Prabhas Spirit movie script work
Sandeep Reddy Vanga : రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ ‘స్పిరిట్’ అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా..? అని రెబల్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సందీప్ వంగ ‘యానిమల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో స్పిరిట్ మూవీ పై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ చిత్ర షూటింగ్ ని 2024 సెప్టెంబర్‌లో మొదలు పెట్టబోతున్నట్లు సందీప్ వంగ ఇటీవల తెలియజేశారు. ఈ సినిమాలో ప్రభాస్.. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటికే తెలియజేశారు. యానిమల్ సినిమాతో లవర్ బాయ్ రణబీర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించిన సందీప్.. ఇక మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Also read : Sandeep Reddy Vanga : చిరంజీవికి సందీప్ వంగ.. ఈ రేంజ్ అభిమానా.. 27ఏళ్ళ క్రిందటి షర్ట్ కలర్..
తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ గురించి సందీప్ వంగ మాట్లాడారు. ‘స్పిరిట్’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజికి వచ్చిందట. రాసిన స్క్రిప్ట్ లో కొన్ని సన్నివేశాలను మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉందట. అది పూర్తి అయితే.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిపోతుందని తెలియజేశారు. 2024 సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం.. ఆడియన్స్ ముందుకు 2025 లోనే రానుందని తెలుస్తుంది. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్ 2, కల్కి, మారుతీతో చేస్తున్న సినిమాలు ఉన్నాయి.
ఈ మూడు పూర్తి అయిన తరువాతే ‘స్పిరిట్’ సినిమా పట్టాలు ఎక్కబోతుందని తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీస్ నిర్మించబోతోంది. ఇక ఈ మూవీ తరువాత సందీప్ వంగ.. ‘యానిమల్ పార్క్’ తెరకెక్కించనున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా టి-సిరీస్ సంస్థే నిర్మించబోతోంది.