Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : మూడు సినిమాలతోనే టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సరికొత్త సినిమాలు తీయడమే కాకుండా హిట్స్ కొట్టి రికార్డులు సాధించాడు. త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు సందీప్.(Sandeep Reddy Vanga)
తాజాగా సందీప్ రెడ్డి, ఆర్జీవీ కలిసి జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్టులుగా హాజరయ్యారు. ఈ షోలో జగపతి బాబు సందీప్ చిన్ననాటి స్నేహితుడు క్రాంతి కుమార్ మాట్లాడిన ఓ వీడియో బైట్ ని ప్లే చేసాడు.
ఈ వీడియో బైట్ లో క్రాంతి కుమార్ సందీప్ చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి చెప్తూ.. మేమిద్దరం LKG నుంచి ఫ్రెండ్స్. సందీప్ 5వ తరగతిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. రోజూ స్కూల్ అయ్యాక ఆమె రిక్షాలో ఇంటికెళ్తుంటే వీడు సైకిల్ మీద ఫాలో అయ్యేవాడు. కొన్నాళ్ళకు ఆ విషయం నాకు చెప్పాడు. దాంతో ఒకరోజు నేను సందీప్ కి తెలియకుండా అతన్ని ఫాలో అయ్యాను. సందీప్ సైకిల్ మీద ఆ అమ్మాయి రిక్షా వెనక వెళ్తుంటే నేను సందీప్ ని దాటి సైకిల్ ని కట్ కొట్టాను. దాంతో సందీప్ కింద పడ్డాడు, ఆ అమ్మాయి నవ్వింది. అయినా సందీప్ లేచి మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ ఆ అమ్మాయి వెనకే వెళ్ళాడు. ఈసారి చేతులు వదిలేసి మరీ తొక్కాడు. ఆ అమ్మాయి అయితే ఇంప్రెస్ అయింది అని చెప్పాడు.
దీని గురించి సందీప్ మాట్లాడుతూ.. అప్పుడు వానాకాలం, కింద బురదలో పడ్డాను. డ్రెస్ అంతా బురద అయింది. ఫ్రెండ్ అని వాడికి చెప్తే ఇలా చేసాడు. అందుకే పరువు పోయింది అనిపించి ఎలాగైనా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని అలాగే లేచి చేతులు వదిలేసి సైకిల్ తొక్కాను అని తెలిపాడు. అలా సందీప్ చిన్ననాటి లవ్ స్టోరీని పంచుకున్నాడు.
Also See : Kushitha Kallapu : ఓనం స్పెషల్ చీరకట్టులో కుషిత కళ్లపు.. ఫొటోలు..