Animal Movie : యానిమల్ సినిమా రన్ టైం మరీ అంతా? ప్రేక్షకులు థియేటర్స్ లో అంత సేపు కూర్చుంటారా?

యానిమల్ సినిమా రన్ టైం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒకప్పుడు మూడు గంటల పైగా ఉన్న సినిమాలు వచ్చినా ప్రస్తుతం 2 గంటల నుండి రెండున్నర గంటల మధ్య ఉండే సినిమాలే ప్రిఫర్ చేస్తున్నారు.

Sandeep Vanga Ranbir Kapoor Rashmika Animal Movie Run Time Goes Viral

Animal Movie : రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న జంటగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ‘యానిమల్’(Animal) సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్, రెండు సాంగ్స్ ని రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గ్యాంగ్ స్టర్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్ని కలిపి ఈ సినిమాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా రన్ టైం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒకప్పుడు మూడు గంటల పైగా ఉన్న సినిమాలు వచ్చినా ప్రస్తుతం 2 గంటల నుండి రెండున్నర గంటల మధ్య ఉండే సినిమాలే ప్రిఫర్ చేస్తున్నారు. షూటింగ్ తర్వాత లెంగ్త్ ఎక్కువ వచ్చినా కట్ చేస్తున్నారు. కానీ ఇటీవల కొన్ని సినిమాలు ధైర్యం చేసి మూడు గంటల వరకు వెళ్తున్నాయి.

ఇప్పుడు అదే కోవలో యానిమల్ సినిమా కూడా వెళ్తుంది. అయితే యానిమల్ సినిమా ఇంకొంచెం పెంచి ఏకంగా మూడు గంటల ముప్పై నిముషాలు ఉంటుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు అంతసేపు అలాంటి యాక్షన్ సినిమాకు థియేటర్ లో కూర్చుంటారా అని కొంతమంది అంటుంటే, ఇది ఫస్ట్ కట్, ఫైనల్ కట్ అయ్యాక ఇంకా లెంగ్త్ తగ్గుతుందని పలువురు అంటున్నారు.

Also Read : Movie Releases : ఈ వారం థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

అయితే ఫైనల్ కట్ అయినా కూడా మూడు గంటలు కచ్చితంగా ఉంటుందని సమాచారం. గతంలో సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమా కూడా మూడు గంటలు ఉండటం విశేషం. అర్జున్ రెడ్డి ఒరిజినల్ వర్షన్ అయితే నాలుగు గంటల పైనే ఉందని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో మరోసారి సందీప్ వంగ ఎక్కువ లెంగ్త్ ఉన్న సినిమానే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరి యానిమల్ సినిమా కోసం థియేటర్స్ లో ప్రేక్షకుడిని సందీప్ వంగ ఎంతసేపు కుర్చోపెడతారో చూడాలి.