Animal Trailer : యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారి ఏ ఎమోషన్ చూపిస్తారో?

త్వరలో యానిమల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని చిత్రయూనిట్ ప్రకటించారు.

Sandeep Vanga Ranbir Kapoor Rashmika Mandanna Animal Trailer Release Date Announced

Animal Trailer : రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న జంటగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘యానిమల్’(Animal). ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి లవ్, రొమాన్స్, యాక్షన్, నాన్న సెంటిమెంట్ చూపిస్తూ సాంగ్స్, టీజర్స్ రిలీజ్ చేశారు.

త్వరలో యానిమల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని చిత్రయూనిట్ ప్రకటించారు. నవంబర్ 23న యానిమల్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఏ టైంకి రిలీజ్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. దీంతో రణబీర్, రష్మిక, సందీప్ వంగ అభిమానులు యానిమల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Richest South Indian Actor : సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? మీరు ఊహించలేరు

ఇక యానిమల్ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే బాలయ్య అన్‌స్టేబుల్ షోకి యానిమల్ మూవీ యూనిట్ వచ్చి సందడి చేయగా ప్రోమో కూడా రిలీజ్ చేశారు.