Richest South Indian Actor : సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? మీరు ఊహించలేరు
సౌతిండియాలో అనేకమంది అగ్రహీరోలు భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుంటారు. రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. వీరి పారితోషికం కోట్లలో ఉంటుంది. అయితే వీళ్లందరిలో రిచెస్ట్ సౌతిండియన్ యాక్టర్ ఎవరో తెలుసా?

Richest South Indian Actor
Richest South Indian Actor : సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన నటుడు ఎవరు? గెస్ చేయగలరా? రజనీకాంత్, చిరంజీవి, దళపతి విజయ్, అజిత్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ వీళ్లలో ఎవరైనా అయి ఉంటారా? కానే కాదు.. ఇంకెవరై ఉంటారు? చదవండి.

Nagarjuna
సౌత్ ఇండియాలో భారీ సినిమాలు చేస్తున్న అగ్ర హీరోలు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. ‘జైలర్’ సినిమాకి రజనీకాంత్ రూ.110 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఆయన నికర ఆస్తి కూడా రూ.430 కోట్లు ఉంటుందని అంచనా. లియో సినిమా కోసం దళపతి విజయ్ రూ.130 కోట్లు తీసుకుంటే..’ఇండియన్ 2′ కోసం కమల్ హాసన్ రూ.150 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ రూ.100 కోట్లు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కూడా భారీ మొత్తంలోనే పారితోషికాలు తీసుకుంటున్నారు. ఇంత మొత్తాల్లో వీరు పారితోషికాలు తీసుకుంటున్నా వీరందరినీ వెనక్కి నెట్టేసి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంతుడైన హీరోగా అక్కినేని నాగార్జున మొదటి స్ధానంలో నిలబడ్డారు. ఆశ్చర్యపోతున్నారా? ఆయన నికర ఆస్తి విలువ రూ.3010 కోట్లుగా తెలుస్తోంది. GQ (మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
హీరోగా, నిర్మాతగా, టీవీ హోస్ట్‌గా, బిజినెస్ మేన్‌గా రాణిస్తున్నారు 64 ఏళ్ల నాగార్జున. నాగార్జున ప్రస్తుతం ఒక సినిమాకు రూ.9 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో ద్వారా నిర్మాతగా వ్యవహరిస్తూ కూడా నాగార్జున బాగానే సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి జట్టుకు సహ యజమానిగా ఉన్నారు నాగార్జున. హైదరాబాద్‌లో ఆయనకు ఉన్న ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో సెలబ్రిటీల ఫంక్షన్లన్నీ అక్కడే జరుగుతుంటాయి. కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా ఉన్న నాగార్జున అనేక రకాలుగా సంపాదనలో బిజీగా ఉన్నారు. ఆయన నివసించే రూ.45 కోట్ల బంగ్లా, కార్లు, ఓ ప్రైవేట్ జెట్ సైతం నాగార్జునకు ఉండటంతో రిచెస్ట్ స్టార్‌గా అవతరించారు నాగార్జున.
Sriram : ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’లో రవితేజకి బదులు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?
ఇక నాగార్జున తరువాత స్ధానాన్ని విక్టరీ వెంకటేష్, చిరంజీవి దక్కించుకున్నారు. వెంకటేష్ నికర ఆస్తి విలువ రూ.2200 కోట్లు కాగా.. చిరంజీవి ఆస్తి విలువ రూ.1650 కోట్లు. రామ్ చరణ్ రూ.1370 కోట్లు కాగా తరువాత స్ధానాల్లో దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఉన్నారు. సినిమాలకు తీసుకునే పారితోషికం పరంగా మిగిలిన హీరోలతో కాస్త వెనుకబడి ఉన్నా అన్ని రంగాలతో కలిపి నాగార్జున అత్యధిక సంపాదన పరుడిగా రిచెస్ట్ యాక్టర్‌గా చరిత్ర సృష్టించారు .