ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు. సంజయ్ ప్రస్తుతం కేజీఎఫ్ చాఫ్టర్ 2, శమ్ షేరా చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన సడక్ -2, భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలు ఓటీటీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
మరోవైపు..కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటానని సంజయ్ ప్రకటించారు. వైద్య నిమిత్తం తన పని నుంచి కొంచెం విరామం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, తన ఆరోగ్యం పట్ల వదంతులు వ్యాపించచేయవద్దని సూచించారు.
త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితులు తనతో ఉన్నారని వెల్లడించారు.