సంజయ్ దత్, సునీల్ శెట్టిలతో మంచు విష్ణు

విష్ణు మంచు హీరోగా సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ‘కాల్‌సెంటర్‌’ షూటింగ్ స్పాట్‌కి బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చారు..

  • Publish Date - October 11, 2019 / 05:07 AM IST

విష్ణు మంచు హీరోగా సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ‘కాల్‌సెంటర్‌’ షూటింగ్ స్పాట్‌కి బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చారు..

విష్ణు మంచు హీరోగా తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోన్న క్రాస్‌ఓవర్ ఫిలిం.. ‘కాల్‌సెంటర్‌’.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు)..
కాజల్‌ అగర్వాల్, ‘చి”ల”సౌ”’ ఫేమ్ రుహానీ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్‌ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుల్‌ స్పీడ్‌గా జరుగుతోంది. ‘కాల్‌ సెంటర్‌’ షూటింగ్‌ లొకేషన్‌కు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ సందర్భంలో తీసిన పిక్ ఇది.

Read Also : దర్శకుల సంఘానికి సూర్య రూ.10 లక్షల విరాళం..

విష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు. కాగా ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ కూడా ఓ అతిథి పాత్రలో నటిస్తారని సమాచారం.. సంజయ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ లో సూర్యవర్ధన్ తమ్ముడు ‘అధీరా’గా కనిపించనున్నాడు.