Sanjay Kapoor : తన ఫస్ట్ ఫోటోషూట్ ‘అమల’తోనే అంటూ బాలీవుడ్ హీరో పోస్ట్.. భార్య ఫన్నీ కామెంట్..
అక్కినేని అమలతోనే తన ఫస్ట్ ఫోటోషూట్ అంటూ బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్ ఒక ఫోటో షేర్ చేశాడు. ఇక ఆ పోస్టుకి అతడి భార్య రెస్పాండ్ అవుతూ..
- gum 95921
- Published On : August 4, 2023 / 05:43 PM IST
Sanjay Kapoor shares his first photoshoot pic with Amala Akkineni
Sanjay Kapoor – Amala Akkineni : ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ టు నార్త్ అనేక సినిమాల్లో నటించి స్టార్ అనిపించుకుంది. 1992లో నాగార్జున (Akkineni Nagarjuna) పెళ్లి చేసుకున్న అమల.. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వస్తుంది. కాగా అమల 1986లో ‘మైథిలి యెన్నై కడలి’ అనే తమిళ చిత్రంతో యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీ తరువాత అమల బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అవ్వాల్సి ఉంది.
Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?
కానీ ఆ మూవీ ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమాతో అమల మాత్రమే కాదు, ఒక స్టార్ నటుడు కూడా బాలీవుడ్ కి పరిచయం అవ్వాల్సి ఉంది. ఆ స్టారే బాలీవుడ్ హీరో ‘సంజయ్ కపూర్’. 1987లో వీరిద్దరితో ఒక సినిమా మొదలైంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా.. అమల అండ్ సంజయ్ పై ఫోటోషూట్ కూడా నిర్వహించారు. సంజయ్ కపూర్ కి ఇది డెబ్యూట్ ఈ మూవీ కావడమే కాదు ఈ మూవీ కోసం చేసిన ఫోటోషూట్ కూడా మొదటిదే. తాజాగా సంజయ్ అందుకు సంబంధించిన ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Aakasam Dhaati Vasthaava : కొరియోగ్రాఫర్ యశ్ ‘లో’ బడ్జెట్ ప్రేమ.. ఆకాశం దాటి వస్తావా టీజర్ రిలీజ్..
“నా మొదటి ఫోటోషూట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అమలతో జరిగింది. కానీ ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది అంటూ” క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన సంజయ్ కపూర్ భార్య ఒక ఫన్నీ కామెంట్ చేసింది. “ఆ సమయంలో నా వయసు 14 సంవత్సరాలు” అంటూ ఫన్నీ ఎమోజిస్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అండ్ కామెంట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సంజయ్ కపూర్.. ఈ సినిమా ఆగిపోయిన తరువాత దాదాపు 8 ఏళ్లకు వెండితెరకు పరిచయం అయ్యాడు.1995లో ప్రేమ్ చిత్రంలో హీరోయిన్ టబుతో కలిసి నటించి యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు.
