సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్‌లో టైటిల్ రోల్ చెయ్యనున్న అలియా భట్..
సల్మాన్‌ఖాన్ హీరోగా ‘ఇన్‌షా అల్లా’ సినిమా చేయాలనుకున్నారు డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. అప్పట్నుంచి ఆ సినిమాలో కథానాయికగా అనుకున్న ఆలియా భట్‌తో, సంజయ్ లీలా భన్సాలీ ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్‌లో వార్తలొచ్చాయి.
ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ‘‘త్వరలో భన్సాలీ దర్శకత్వంలో పని చేయబోతున్నా’’ అని ఆలియా చెప్పింది. రీసెంట్‌గా ఆ వార్తలను నిజం చేస్తూ.. భన్సాలీ తన కొత్త సినిమాను విడుదల తేదీతో సహా ప్రకటించారు. ఈ సినిమాకు ‘గంగూబాయి కతియావాడి’ టైటిల్ ఫిక్స్ చేశారు. గంగూభాయి రోల్ చెయ్యడం తనకెంతో స్పెషల్ అని అలియా ట్వీట్ చేసింది.
Read Also : శివన్న ‘ఆయుష్మాన్‌భవ’ – టీజర్
గంగూబాయిగా ఆలియా నటించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. 2020 సెప్టెంబర్ 11న ‘గంగూబాయి కతియావాడి’ విడుదల అవనుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తుంది అలియా.
A name you’ve heard a story you haven’t. #GangubaiKathiawadi ❤ This ones going to be special!!
Directed by #SanjayLeelaBhansali, releasing 11 September 2020. @bhansali_produc @prerna982 @PenMovies @jayantilalgada— Alia Bhatt (@aliaa08) October 16, 2019