తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో టెంకాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడి కాయ కొట్టేవరకు.. తర్వాత విడుదల తేదీ.. ఇలా ప్రతి విషయాన్ని సెంటిమెంట్‌ను ముహుర్తాల విషయంలో పెట్టుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో టాప్‌హీరోలు కూడా ఈ సెంటిమెంట్ల గురించి ఆలోచిస్తుంటారు.
ఇలాంటి పరిస్థుతులలో మెగా హీరోలకు సంక్రాంతి సక్సస్ రెండేళ్ల నుంచి లేదు. అనే సెంటిమెంట్‌ను ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి సంక్రాంతికి వస్తున్న మెగా హీరో అల్లూ అర్జున్‌కి ఈ సెంటిమెంట్ ఎఫెక్ట్ ఉంటుందా? ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడా? అనే దాని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.
2018లో అత్యంత భారీ అంచనాలతో జనవరి 10న విడుదలైన ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ పవన్ అభిమానులు మరిచిపోలేని చేదు నిజం. ఈసినిమా విడుదలై రెండేళ్లు గడిచినా పవన్ అభిమానులు ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. తర్వాతి సంవత్సరం రంగస్థలం సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై భారీ ఫ్లాప్ అయ్యింది. చరణ్ అభిమానులకు కూడ ఏమాత్రం నచ్చని ఈమూవీ ఫెయిల్యూర్ తో బయ్యర్లు నష్టపోయ్యారు.
అయితే ఈ సంక్రాంతికి మాత్రం మెగా హీరో అల్లూ అర్జున్ ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడని గట్టిగా భావిస్తున్నారు మెగా అభిమానులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లూ అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని పక్కాగా హిట్ కొట్టాలని నిర్ణయించుకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. సినిమాను సంక్రాంతికి విడుదల చేయనుంది చిత్రయూనిట్.