Sankranthi Movies : సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది? ఏ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది?

ఈ సారి సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉండటంతో భారీ క్లాష్ ఏర్పడింది. బిజినెస్ కూడా బాగా జరిగింది. ఇప్పటికే అన్ని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు అయిపోయాయి. థియేట్రికల్ రైట్స్ భారీగానే అమ్ముడయ్యాయి.

Sankranthi Movies : సంక్రాంతి అంటేనే పెద్ద పండగ, ముఖ్యంగా సినిమాల పండగ కూడా. స్టార్స్ అంతా సంక్రాంతికి వస్తారని తెలిసిందే. ఈసారి 2024లో కూడా స్టార్స్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఈ సంక్రాంతికి జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం(Guntur Kaaram), తేజ సజ్జ హనుమాన్(Hanuman) సినిమాలు రాబోతున్నాయి. జనవరి 13న వెంకటేష్ సైంధవ్‌(Saindhav) రాబోతుంది. జనవరి 14న నాగార్జున నా సామిరంగ(Naa Saami Ranga) వచ్చేస్తుంది. దీంతో ఈ సారి సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉండటంతో భారీ క్లాష్ ఏర్పడింది.

నాలుగు సినిమాలు ఉండటంతో బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ఇప్పటికే అన్ని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు అయిపోయాయి. థియేట్రికల్ రైట్స్ భారీగానే అమ్ముడయ్యాయి. మహేష్ గుంటూరు కారం సినిమాకు ఏకంగా 135 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్, మిగిలిన రాష్ట్రాల్లో కలిపి ఈ రేంజ్ ధరకు అమ్ముడయింది. గుంటూరు కారం సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా అయితే ఇంకా ఎక్కువకు అమ్ముడయ్యేది.

ఇక వెంకటేష్ సైంధవ్‌ సినిమా దాదాపు 25 కోట్ల వరకు థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా కూడా కేవలం తెలుగులోనే రిలీజవుతుంది.

తేజ సజ్జ హనుమాన్ సినిమా కూడా 25 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అయితే ఇది పాన్ ఇండియా సినిమా. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. తేజ సజ్జకి అంత మార్కెట్ లేకపోయినా హనుమాన్ టైటిల్, అదిరిపోయిన గ్రాఫిక్స్, పండగ సీజన్ కావడంతో ఆ రేంజ్ లో థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి.

ఇక నాగార్జున నా సామిరంగ సినిమా దాదాపు 18 కోట్లకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చేసింది. ఈ సినిమా కూడా కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది.

Also Read : Venkatesh : అలనాటి హీరోయిన్స్‌తో వెంకీ మామ ‘అల్లుడా మజాకా’.. సంక్రాంతి పండక్కి..

అంటే సంక్రాంతికి రాబోయే నాలుగు సినిమాలు ఆల్మోస్ట్ 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిపాయి. ఇక మహేష్(Mahesh Babu) గుంటూరు కారం సినిమాకు దాదాపు 300 కోట్లు, వెంకటేష్(Venkatesh) సైంధవ్‌ సినిమాకు 50 కోట్లు పైన, తేజ సజ్జ(Teja Sajja) హనుమాన్ కి 50 కోట్ల పైన, నాగార్జున(Nagarjuna) నా సామిరంగ కూడా 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడతాయని అంచనా వేస్తున్నారు. అంటే ఈ సంక్రాంతికి ఎంత కాదనుకున్నా కనీసం 500 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కేవలం తెలుగు రిలీజ్ సినిమాలతోనే ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంటే అదే పాన్ ఇండియా అయితే లెక్క ఇంకోలా ఉండేది అని, టాలీవుడ్ రేంజ్ మారిపోయింది అని సినీ అభిమానులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు