సంక్రాంతి మరో మూడు రోజులుందండోయ్!

2020 సంక్రాంతి మరో మూడు రోజులపాటు జనవరి 19 వరకు పొడిగించబడింది..

  • Published By: sekhar ,Published On : January 16, 2020 / 11:18 AM IST
సంక్రాంతి మరో మూడు రోజులుందండోయ్!

Updated On : January 16, 2020 / 11:18 AM IST

2020 సంక్రాంతి మరో మూడు రోజులపాటు జనవరి 19 వరకు పొడిగించబడింది..

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి జనవరి 16న జరుపుకునే కనుమతో ముగుస్తుంది. కానీ ఈ సంక్రాంతి మరో మూడు రోజులపాటు పొడిగించబడింది. పండగ పొడిగించడం ఏంటి అనుకుంటున్నారా.. విషయం ఏంటంటే..

Image

జనవరి 17న యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వనున్నాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులకు పండగే కదా మరి.. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్ కూడా అదే రోజు హన్మకొండలో జరుగనుంది.

Image

జనవరి 18న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ మీట్ జరుగనుంది. జనవరి 19న మాస్ మహరాజ్ రవితేజ ‘డిస్కో రాజా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. సో ఈ షెడ్యూల్ ప్రకారం పండగ మరో మూడు రోజులపాటు ఎక్స్టెండ్ అయిందన్నమాట.