శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్ : విద్యా కుతురిగా సాన్యా

‘దంగల్’ చిత్రంలో బబితగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సాన్యా మల్హోత్రా.. ‘శకుంతలా దేవి - హ్యూమన్ కంప్యూటర్’ మూవీలో విద్యా బాలన్ కూతురు అనుపమా బెనర్జీ పాత్రలో నటిస్తుంది..

  • Published By: sekhar ,Published On : October 5, 2019 / 08:07 AM IST
శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్ : విద్యా కుతురిగా సాన్యా

Updated On : October 5, 2019 / 8:07 AM IST

‘దంగల్’ చిత్రంలో బబితగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సాన్యా మల్హోత్రా.. ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ మూవీలో విద్యా బాలన్ కూతురు అనుపమా బెనర్జీ పాత్రలో నటిస్తుంది..

ప్రముఖ గణిత శాస్త్ర నిపుణురాలు, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా.. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బయోపిక్.. ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’.. గణితవేత్త, రచయిత శకుంతలా దేవి క్యారెక్టర్ చేస్తున్న విద్యా బాలన్ ఫస్ట్ లుక ఇటీవల రిలీజ్ చెయ్యగా చక్కటి స్పందన వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా నుండి సాన్యా మల్హోత్రా లుక్ రిలీజ్ చేశారు.

‘దంగల్’ చిత్రంలో బబితగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సాన్యా మల్హోత్రా.. ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ మూవీలో విద్యా బాలన్ కూతురు అనుపమా బెనర్జీ పాత్రలో నటిస్తుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా.. ‘దంగల్ సినిమా కోసం మొదటిసారి నా జుత్తు కత్తిరించుకున్నాను.. ఇప్పుడు మళ్లీ ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ మూవీ కోసం జుత్తు కత్తిరించుకున్నాను.

Read Also : రూ. 100 కోట్ల ‘వార్’

‘క్యారెక్టర్ కోసం మేకోవర్ కావడం హ్యాపీగా అనిపిస్తుంది. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చేసేప్పుడు వారి లుక్‌లోకి చేంజ్ అయితే ఆ రోల్ ఇంకా బాగా చేయొచ్చు అనేది నా నమ్మకం’ అంటూ ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ మూవీ పట్ల తను ఎంత డెడికేటెడ్‌గా ఉందో వెల్లడించింది సాన్యా.. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తుండగా, అను మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు.