Sara Ali Khan : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో హీరోయిన్ ఫిక్స్?.. పూరి ఖాతాలో ఈసారి కూడా మరో బాలీవుడ్ భామ..

ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Sara Ali Khan will placed as Heroine in Puri Jagannadh Ram Pothineni Double Ismart Movie Rumours goes Viral

Sara Ali Khan :  పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని(Ram Pothineni) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar)కి ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక డబల్ ఇస్మార్ట్ సినిమాని 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి.

ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటిదాకా బేబీ సినిమా వైష్ణవి చైతన్య ఇందులో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చినా అవి పుకార్లే అని వైష్ణవి టీం నుంచి సమాచారం.

సాధారణంగా ఇండస్ట్రీకి పూరి కొత్త హీరోయిన్స్ ని లేదా బాలీవుడ్ హీరోయిన్స్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటాడు. అలా చాలా మంది బాలీవుడ్ భామలని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పూరి. ఇటీవల లైగర్ సినిమాతో కూడా అనన్య పాండే ని తెలుగులో పరిచయం చేశాడు. ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ సినిమాతో ఇంకో బాలీవుడ్ భామని తెలుగు వాళ్లకి పరిచయం చేయబోతున్నట్టు సమాచారం.

Also Read : Suriya : కర్ణుడిగా సూర్య..? బాలీవుడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా..

సైఫ్ అలీఖాన్ కూతురు, ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకెళ్తున్న సారా అలీఖాన్ ని డబల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా చిత్రయూనిట్ కానీ, సారా అలీఖాన్ కానీ ఇంకా స్పందించలేదు. గతంలో లైగర్ సినిమాకు కూడా సారా అలీఖాన్ ని, జాన్వీ కపూర్ ని పూరి అడగగా డేట్స్ లేక నో చెప్పినట్టు పూరీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో సారాని ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కోసం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు