Saree Song : ఆర్జీవీ ‘శారీ’ సినిమా సాంగ్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. హ్యాపీ వరల్డ్ శారీ డే అంటూ..

ఆర్జీవీ శారీ గర్ల్ సాంగ్ మీరు కూడా చూసేయండి..

Saree Girl Song Released from RGV Aaradhya Devi Saree Movie

Saree Song : ఆర్జీవీ మలయాళీ నటి శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)తో శారీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసాడు. వీటిల్లో హీరోయిన్ ఆరాధ్య అందాలను ఓ రేంజ్ లో చూపించాడు. తాజాగా నేడు వరల్డ్ శారీ డే అంటూ తన శారీ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసాడు ఆర్జీవీ.

Also Read : Balakrishna – Venkatesh : బాలయ్య బాబుతో వెంకీమామ సందడి.. పండక్కి అన్‌స్టాపబుల్ మాములుగా ఉండదు..

‘శారీ గర్ల్..’ అంటూ ఇంగ్లీష్ లో సాగింది ఈ పాట. ఆర్జీవీ ఛానల్ లో ఈ పాట రిలీజ్ చేసారు. ఈ పాటలో కూడా హీరోయిన్ తో శారీలో అందాలు చూపించారు. హీరోయిన్ ని ప్రేమించే అబ్బాయి సినిమాలో ఈ సాంగ్ పాడుతున్నట్టు ఉంది. ఆర్జీవీ శారీ గర్ల్ సాంగ్ మీరు కూడా చూసేయండి..

అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సాంగ్ చివర్లోనే శారీ సినిమా జనవరి 30 న రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పాటను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ వరల్డ్ శారీ డే.. శారీ సినిమా నుంచి శారీ గర్ల్ సాంగ్ రిలీజ్ అయింది. సినిమా జనవరి 30 న రిలీజ్ కానుంది అని తెలిపారు ఆర్జీవీ.