బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’, ’అల వైకుంఠపురములో‘..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల… వైకుంఠపురములో’ సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు అటు ఇటుగా భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఫస్ట్ డే మార్నింగ్ షో నుండే రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.
పండగ సీజన్ పైగా లాంగ్ వీకెండ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతున్నాయి.. అయితే కొన్ని ఏరియాల్లో ఈ రెండు సినిమాలు నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేశాయని చెప్తూ, రోజులతో పాటు లెక్కలు చెబుతూ.. ‘బ్లాక్ బస్టర్ కా బాప్, సంక్రాంతి బాక్సాఫీస్ మొగుడు, సంక్రాంతి చాంపియన్, అసలైన సంక్రాంతి విన్నర్’ అంటూ మేకర్స్ డిఫరెంట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.
కానీ ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఏ ఏరియాలో ఏ లెక్కన బాహుబలిని బీట్ చేశాయి అని వివరంగా చెబితే ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్ ఉండదు అంటున్నారు ట్రేడ్ పండితులు.. వచ్చే సోమవారానికి రెండిటిలో ఏ సినిమా బాక్సాఫీస్ బరిలో నిలుస్తుంది, సత్తా చాటుతుంది అనేది తెలిసిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు.