‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 25 నుండి కొత్త సన్నివేశం యాడ్ చేస్తున్నారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
నేటితో రెండు వారలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం మంచి ప్రశంసలు అందచేస్తున్నారు.
‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంకా ఎక్కువ చేయాలని సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రావు రమేష్ ఫ్యామిలి మెంబర్స్ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియస్ సన్నివేశాన్ని జనవరి 25(శనివారం) మార్నింగ్ షో నుండి అన్నిసెంటర్స్‌లలో యాడ్ చేస్తున్నాం’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.