Sarvam Maya movie OTT streaming update
Sarvam Maya OTT: మలయాళ ఇండస్ట్రీ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమా సర్వం మాయ(Sarvam Maya OTT). అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అఖిల్ సత్యన్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో మలయాళ స్టార్ నివిన్ పౌలీ హీరోగా నటించాడు. హారర్ కామెడీ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా మలయాళ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించింది.
Eesha Rebba: తెలుపు డ్రెస్సులో వలపు వల.. ఈషా రెబ్బ లేటెస్ట్ ఫొటోస్
ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసింది. జనవరి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. అయితే, ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటలోకి రానుంది.
నిజానికి ఈ సినిమా మంచి విజయం సాధించింది అని తెలిసి చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూడాలని అనుకున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.