‘శాటిలైట్ శంకర్’ : ట్రైలర్

సూరజ్ పంచోలీ, మేఘా ఆకాష్ జంటగా.. ఇర్ఫాన్ కమాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాటిలైట్ శంకర్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 15 విడుదల..

  • Publish Date - October 17, 2019 / 10:52 AM IST

సూరజ్ పంచోలీ, మేఘా ఆకాష్ జంటగా.. ఇర్ఫాన్ కమాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాటిలైట్ శంకర్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 15 విడుదల..

సూరజ్ పంచోలీ, మేఘా ఆకాష్ జంటగా.. ఇర్ఫాన్ కమాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాటిలైట్ శంకర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సినీ 1 స్టూడియోస్, ఎస్‌సి‌పిఎల్ బ్యానర్స్‌పై మూరద్ ఖేతాని, అశ్విన్ వర్ధే నిర్మిస్తున్నారు. ‘ఒక శాటిలైట్ అంతరిక్షంలో తిరుగుతూ మనుష్యులకు సిగ్నల్స్ పంపుతుంది.. హిందూస్థాన్ సరిహద్దులో ఉన్న మరో శాటిలైట్ మనుషులను కలుపుతుంది’.. అనే వాయిస్‌తో ‘శాటిలైట్ శంకర్’ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. 

ఆర్మీ జవాను తన సొంతూరికి తిరిగొస్తుండగా.. మార్గమధ్యంలో అతనికి ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

Read Also : కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ టైటిల్ పోస్టర్

నవంబర్ 15న ‘శాటిలైట్ శంకర్’ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : మిథున్, రోచక్ కోహ్లీ, తనిష్క బగ్చీ, స్కోర్ : సందీప్ శిరోద్కర్, సినిమాటోగ్రఫీ : జితన్ హర్మీత్ సింగ్, ఎడిటింగ్ : చందన్ అరోరా, రైటింగ్ : ఇర్ఫాన్ కమాల్, విశాల్ విజయ్ కుమార్.