Zebra Teaser : సత్యదేవ్ జీబ్రా టీజర్ రిలీజ్.. కామెడీతో పాటు థ్రిల్లింగ్ కూడా..

తాజాగా జీబ్రా టీజర్ రిలీజ్ చేసారు.

Satya Dev Priya Bhavani Shankar Zebra teaser Released

Zebra Teaser : వరుస సినిమాలతో మెప్పిస్తున్న సత్యదేవ్ త్వరలో జీబ్రా సినిమాతో రాబోతున్నాడు. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో జీబ్రా సినిమా తెరకెక్కుతుంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో జీబ్రా సినిమాని నిర్మిస్తున్నారు.

ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా జీబ్రా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే లవ్ స్టోరీ, కామెడీతో పాటు ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మీరు కూడా జీబ్రా టీజర్ చూసేయండి..

https://www.youtube.com/watch?v=1rDxV2-5H4A

ఇక ఈ జీబ్రా సినిమా అక్టోబర్ 31న దీపావళి కానుకగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. సత్యదేవ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.