Satyam Rajesh : నాకు భారీ బడ్జెట్ సినిమాలు అవసర్లేదు.. నేను ఎవరితోనూ పోటీ పడి సినిమాలు చేయను..

టెనెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన సత్యం రాజేష్.. మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Satyam Rajesh : సత్యం సినిమాతో సినీ పరిశ్రమలోని స్థానం సంపాదించుకొని ఇరవై ఏళ్లుగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సత్యం రాజేష్ ఇటీవల హీరోగా కూడా సక్సెస్ అవుతున్నాడు. పొలిమేర, పొలిమేర 2 సినిమాల సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ ‘టెనెంట్’ అనే సినిమాతో రాబోతున్నాడు.

మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాణంలో వై.యుగంధర్‌ దర్శకత్వంలో సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన టెనెంట్ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని అంచనాలు పెంచారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా సత్యం రాజేష్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. టెనెంట్ అనేది ఓ అపార్టుమెంట్లో ఎదిరిల్లు, పక్కిల్లు, చుట్టూ పక్కల వారి మధ్య జరిగే కథ. చాలా వరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉన్నారు.. ఇలాంటి కాన్సెప్ట్ ని కూడా టచ్ చేసాము. సినిమాలో కొన్ని సీన్స్ వల్ల A సర్టిఫికెట్ ఇచ్చినా ఇది అందరూ చూడాల్సిన సినిమా. నా రేంజ్ కి తగ్గట్టు సింపుల్ కథలు, మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాను. భారీ బడ్జెట్ సినిమాలు అవసర్లేదు. మంచి పాయింట్ ఉండే సినిమాలు చేస్తాను. టెనెంట్ కూడా అలంటి సినిమానే. నేను ఎవరితోనూ పోటీ పడి సినిమాలు చేయాలనుకోవట్లేదు అని తెలిపారు.

Also read : Sarkaar Season 4 : సర్కార్ సీజన్ 4 ప్రోమో చూశారా.. కమ్‌బ్యాక్‌తో నవ్వుల సుడిగాలి సృష్టిస్తున్న సుధీర్..

అలాగే.. కథ చెప్పినప్పుడు భలే ఉంది అనిపించింది. సినిమా తీసాక కూడా అలాగే అనిపించింది. నేను చాలా ఫీల్ అయ్యాను ఈ సినిమాని. డబ్బింగ్ తర్వాత ఏడ్చేసాను కూడా. ఈ సినిమాని ఓటీటీ కోసం అనుకున్నా తర్వాత పొలిమేర థియేటర్స్ లో హిట్ అవ్వడంతో దీనికి ఇంకొన్ని సీన్స్ రాసుకొని థియేట్రికల్ సినిమా చేశాము. ఇందులో డైలాగ్స్ కూడా బాగుంటాయి. నేను మాట్లాడేది తక్కువే ఉన్నా నెగిటివ్ షేడ్ తో చేసాను. ఈ సినిమాలో సాహిత్య సాగర్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. క్లైమాక్స్ లో అయితే కన్నీళ్లు వచ్చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ అంత బాగా ఇచ్చాడు అని తెలిపారు.

ఇక తన దగ్గరికి చాలా కథలు వస్తున్నా ఇలాంటి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నట్టు, తనకు సెట్ అయ్యే సినిమాలు ఏరుకుంటున్నట్టు , హీరోగా చేసినా ఆర్టిస్ట్ గా కూడా చేస్తాను అని తెలిపారు సత్యం రాజేష్. ఇక నెక్స్ట్ స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా మెయిన్ లీడ్ గా, రవితేజ మిస్టర్ బచ్చన్, మట్కా సినిమాలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు