Satyanand : నా ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్.. చిరంజీవి 1992లో నాకు ఫోన్ చేసి పిలిచి..

ఎంతోమంది హీరోలకు యాక్టింగ్ శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు.

Satyanand

Satyanand : హరిహర వీరమల్లు సినిమా రేపు జులై 24న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో నేడు వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి యాక్టింగ్ ట్రైనర్, ఎంతోమంది హీరోలకు యాక్టింగ్ శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు.

Also See : హరిహర వీరమల్లు.. వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి..

ఈ ఈవెంట్లో సత్యానంద్ మాట్లాడుతూ.. 1992లో చిరంజీవి ఫోన్ చేసి తొందరగా చెన్నై రమ్మన్నారు. వెళ్తే పవన్ కళ్యాణ్ ని చూపించి ఇతను నా తమ్ముడు, ఇతన్ని ఆర్టిస్ట్ గా తయారుచేయాలి అన్నారు. అప్పటివరకు నేను నాటకాలు వేస్తూ, ఏదో క్లాసులు చెప్తూ బతుకుతున్నా. కానీ ఆ తర్వాత నేను అప్పట్నుంచి ఇప్పటివరకు క్లాసులు చెప్తూనే ఉన్నాను. నా ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్ తోనే నా పవర్ మొదలైంది అని తెలిపారు.