Save The Tigers Season 3: మళ్లీ మొదలైన ముగ్గురు మొగుళ్ల పంచాయితీ.. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్ అవుట్
సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్న సేవ్ ది టైగెర్స్ సీజన్ 3(Save The Tigers Season 3). ఆకట్టుకుంటున్న ట్రైలర్.
- V Santhosh Kumar
- Updated on- May 30, 2026 / 09:57 PM IST
Save the tigers season 3 trailer release jio plus hotstar
- ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్.
- జూన్ 19 నుండి స్ట్రీమింగ్.
- వెన్నెల కిషోర్ ప్రత్యేక ఎంట్రీ.
Save The Tigers Season 3: తెలుగు ఓటీటీ రంగంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రికార్డులు సృష్టించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు మరింత డబుల్ డోస్ ఫన్‌తో ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ క్రేజీ సిరీస్‌కు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ క్రియేటర్స్ మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్, జూన్ 19 నుండి ‘జియో హాట్‌స్టార్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Peddi Chennai Event: చెన్నైలో రామ్ చరణ్ ‘పెద్ది’ గ్రాండ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్!
ఈ సరికొత్త సీజన్‌ను దర్శకుడు శ్రీరామ్ ఎరగం ఒక ఆసక్తికరమైన ‘కాస్మిక్ ట్విస్ట్’తో సరికొత్త పంథాలో తెరకెక్కించారు. రెండు వైవిధ్యమైన ప్రపంచాల మధ్య జరిగే ఒక సోషల్ ఎక్స్‌పెరిమెంట్‌లా ఈ కథ సాగనుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. గత సీజన్లలో తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించిన పాత జంటలు ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం – పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య – దేవియాని శర్మ ఈసారి కూడా తమ కెమిస్ట్రీతో అలరించడానికి సిద్ధమయ్యారు. “పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి అని ఎవడ్రా చెప్పింది” లాంటి డైలాగులు ట్రైలర్‌లో బాగా పేలాయి.
అయితే ఈ సీజన్ 3(Save The Tigers Season 3)లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వడం. ఈ సిరీస్‌లో ఆయన ‘ఇంద్రుడి’ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’ ప్రవేశించి, ఆ టైగర్స్‌ను వారి భార్యల నుండి ఎలా సేవ్ చేశాడనేది ఈ సీజన్లనే అత్యంత ఆసక్తికరమైన అంశం. వెన్నెల కిషోర్ తోడు కావడంతో ఈసారి వినోదం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
