‘‘వి’’ నుండి రక్షకుడు వచ్చేశాడు!

‘‘వి’’ మూవీలో నుంచి ‘రక్షకుడు’ గా సుధీర్ బాబు ఫస్ట్‌లుక్ రిలీజ్..

  • Publish Date - January 27, 2020 / 05:37 AM IST

‘‘వి’’ మూవీలో నుంచి ‘రక్షకుడు’ గా సుధీర్ బాబు ఫస్ట్‌లుక్ రిలీజ్..

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ‘‘వి’’.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు.. “రాక్షసుడు” ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు … “రక్షకుడు” వస్తున్నాడు.. అంటూ ప్రకటించిన టీమ్.. సోమవారం ఉదయం ఈ సినిమాలోని ‘రక్షకుడు’ సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో గన్‌తో గురివైపు తీక్షణంగా చూస్తున్న సుధీర్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది.

Read Also : దళపతి, మక్కల్ సెల్వన్ ‘మాస్టర్’ మూడో పోస్టర్

జనవరి 28 ఉదయం 10 గంటలకు ‘రాక్షసుడు’గా నాని ఎలా ఉండబోతున్నాడో చూపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఉగాది కానుకగా మార్చి 25న ‘వి’ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : అమిత్ త్రివేది, సినిమాటోగ్రఫీ : పిజి విందా, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, ఫైట్స్ : రవి వర్మ.