ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న మాస్ థ్రిల్లర్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న థ్రిల్లర్.. ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆదిత్యగా రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, నువ్వే నువ్వే సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా పలు సినిమా షూటింగులు, రిలీజులు వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘రెడ్’ చిత్రం విడుదలపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ఎట్టిపరిస్థితిలోనూ ముందు చెప్పిన డేట్ ప్రకారం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9నే ‘రెడ్’ ప్రేక్షకులముందుకు వస్తుంది అని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.