Sekhar kammula watched gandhi movie with childrens
Sekhar kammula : 75 ఏళ్ల భారత స్వతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సినిమా థియేటర్లలో ఉదయం ఆటగా ‘గాంధీ’ చిత్రాన్ని చూపిస్తుంది. ఈ షోను హైదారాబాద్ దేవి థియేటర్లో విద్యార్థులతో కలిసి చూశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. వందల మంది విద్యార్థులతో గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందంటూ ఆయన స్పందించారు. భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Nayan-Vignesh Photoshoot : సినిమా సాంగ్ లెవల్లో నయన్, విగ్నేశ్ ఫొటోషూట్
దీనిపై శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో తను పిల్లలతో కలిసి కూర్చొని సినిమా చూస్తున్న ఫోటోని షేర్ చేసి.. ”ఇవాళ దేవి థియేటర్ లో గాంధీ మూవీని వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదొక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి” అని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ వారిని కూడా ట్యాగ్ చేశారు.