Selvaraghavan: ‘యుగానికొక్కడు’ బడ్జెట్ మరీ ఇంత తక్కువా?!
కార్తీ, రీమాసేన్, ఆండ్రియా నటించిన యుగానికి ఒక్కడు సినిమా గుర్తుందా. ఆయిరత్తిల్ ఒరువన్ (Aayirathil Oruvan) పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమా
- Naresh Mannam
- Published On : August 19, 2021 / 04:12 PM IST
Selvaraghavan
Selvaraghavan: కార్తీ, రీమాసేన్, ఆండ్రియా నటించిన యుగానికి ఒక్కడు సినిమా గుర్తుందా. ఆయిరత్తిల్ ఒరువన్ (Aayirathil Oruvan) పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో యుగానికి ఒక్కడు పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానెల్ మారకుండా టీఆర్పీలు సొంతం చేసుకొనే ఈ సినిమాతో కార్తీ, ఆండ్రియా తెలుగులో కూడా మార్కెట్ పెంచుకోగలిగారు.
దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించగా ప్రస్తుతానికి అది ఎప్పుడు మొదలవుతుందన్నది స్పష్టత లేదు. కానీ, యుగానికి ఒక్కడు సినిమా గురించి సెల్వరాఘవన్ చేసిన ఓ ట్వీట్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను జస్ట్ రూ.18 కోట్లతో పూర్తిచేశారని దర్శకుడు సెల్వరాఘవన్ చెప్పాడు. దీనిపై కొంత వివరణ కూడా ఇచ్చారు.
కేవలం 18 కోట్ల బడ్జెట్ తోనే ఆయిరత్తిల్ ఒరువన్ పూర్తి చేసానని.. కానీ హైప్ కోసం రూ.32 కోట్లు పెట్టామని చెప్పినట్లు అసలు విషయం చెప్పారు. ఈ సినిమా అసలు బడ్జెట్ ని రాబట్టినప్పటికీ దీనిని యావరేజ్ గానే లెక్కలోకి తీసుకున్నారు. దీని తర్వాత ఎలాంటి అడ్డంకులు ఉన్నా అబద్దాలు చెప్పకూడదనేది నేర్చుకున్నానని సెల్వ రాఘవన్ తెలిపారు. దీనితో ఈ సినిమా అసలు బడ్జెట్ తెలుసుకున్న వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
