Giri Babu : గిరిబాబు కన్నుమూత.. ఆయన ఇద్దరు కొడుకుల గురించి తెలుసా? స్టార్ కమెడియన్, హీరో..

గిరిబాబు దాదాపు 600 సినిమాల్లో నటించారు. ఈయన ఇద్దరు కొడుకులు కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. (Giri Babu)

  • Updated on- November 14, 2026 / 04:43 PM IST

Giri Babu

Giri Babu : ఎన్నో సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సీనియర్ నటుడు గిరిబాబు కొద్దిసేపటి క్రితం మరణించారు. పలు అనారోగ్య సమస్యలతో, వయోభారంతో చికిత్స పొందుతూనే 80 ఏళ్ళ వయసులో మరణించారు.

గిరిబాబు దాదాపు 600 సినిమాల్లో నటించారు. ఈయన ఇద్దరు కొడుకులు కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. స్టార్ కమెడియన్ రఘుబాబు ఈయన పెద్ద కొడుకు. 1990 లో దొంగలు ఉన్నారు జాగ్రత్త సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు మురారి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. బన్నీ సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా రఘుబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా నిన్నే దొంగ నా కొడుకు సినిమాలో హీరోయిన్ తండ్రిగా పలకరించారు.

Also Read : Giri Babu : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత..

ఇక గిరిబాబు చిన్నకొడుకు బోసుబాబు. ఆయన్ని హీరోగా చేద్దామని ప్రయత్నించారు. 1990లో బోసుబాబు హీరోగా ఇంద్రజిత్ అనే సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత నిమజ్జనం, చెమ్మచెక్క, స్టంట్ మ్యాన్.. లాంటి సినిమాలతో హీరోగా వచ్చినా అవి ఫ్లాప్ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు బోసుబాబు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

గిరిబాబు భార్య శ్రీదేవి 2016లో మరణించారు. గతంలో గిరిబాబుకి ఓ డాక్టరేట్ వచ్చినప్పుడు ఆయన భార్య, కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాలితో కలిసి ఫ్యామిలీతో కనిపించారు. ఇప్పుడు గిరిబాబు మరణంతో ఆయన కుటుంబం తీవ్ర శోకంలో ఉన్నారు.