×
Ad

Mahesh Babu : మహేష్ బాబుకు అక్కగా, తల్లిగా నటించిన ఒకే ఒక నటి.. ఎవరో తెలుసా? అప్పట్లో హీరోయిన్..

ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన నటి మహేష్ బాబు కి ఓ సినిమాలో అక్కగా మరో సినిమాలో తల్లిగా కూడా చేసింది. (Mahesh Babu)

Mahesh Babu

Mahesh Babu : ఒకప్పటి హీరోయిన్స్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోతారు. అలా ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన నటి మహేష్ బాబు కి ఓ సినిమాలో అక్కగా మరో సినిమాలో తల్లిగా కూడా చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏఏ సినిమాలో తెలుసా?(Mahesh Babu)

మహేష్ బాబుకి అక్కగా, తల్లిగా నటించిన ఏకైక నటి గీత కదంబి. తమిళనాడుకు చెందిన గీత 1978 లో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమలలో నటించింది. ఆ సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. 1990లో కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా బాలచంద్రుడు. ఈ సినిమాలో మహేష్ బాబు మెయిన్ లీడ్ నటించగా గీత మహేష్ కి అక్క పాత్రలో నటించింది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య చాలానే సన్నివేశాలు ఉంటాయి.

Also See : Ashwini Dutt : స్టార్ నిర్మాత కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు.. సందడి చేసిన లేడీ ప్రొడ్యూసర్స్..

అనంతరం గీత 1997లో ఓ CA ని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. 2003లో మహేష్ బాబు హీరోగా చేసిన ఒక్కడు సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో నటించింది గీత. ఒక్కడు సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తల్లి పాత్రతో మహేష్ కి చాలానే సీన్స్ ఉన్నాయి. అలా బాలచంద్రుడు సినిమాలో మహేష్ కి అక్కగా, ఒక్కడు సినిమాలో తల్లిగా నటించింది గీత. రీ ఎంట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.

Also See : Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..