Senior Actress
Actress : సినీ పరిశ్రమలో ఓపిక ఉన్నంతవరకు పని చేస్తారు చాలా మంది ఆర్టిస్టులు. చాలా తక్కువమంది రిటైర్మెంట్ తీసుకుంటారు సినీ పరిశ్రమలో. తాజాగా ఓ సీనియర్ నటి, ఒకప్పటి హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్ట్ రిటైర్మెంట్ అని సంచలన నిర్ణయం తీసుకుంది.(Senior Actress)
ఇంతకీ ఆ నటి ఎవరో అనుకుంటున్నారా. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అత్త పాత్రల్లో దూసుకుపోతున్న తులసి. తులసి తల్లి మహానటి సావిత్రి ఫ్రెండ్. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సి వచ్చి సావిత్రి అడగడంతో తులసిని సినిమాల్లోకి తీసుకొచ్చారు. అలా మూడేళ్లకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తులసి. అప్పట్నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేసింది. ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన పర్ఫార్మెన్స్ తో మెప్పించి నంది అవార్డు కూడా అందుకుంది.
Also Read : Nayanthara : వామ్మో.. నయనతారకు ఖరీదైన కార్ కొనిచ్చిన భర్త.. దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?
అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తులసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.
తన సోషల్ మీడియాలో తులసి దీనిపై ఓ పోస్ట్ పెట్టింది.. ఈ డిసెంబర్ 31 న షిరిడి దర్శనానికి వెళ్తున్నాను. ఈ మేరకు హ్యాపీ రిటైర్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపై నా జర్నీ సాయి నాధుడు దగ్గర ప్రశాంతంగా కొనసాగుతుంది. నా లైఫ్ లో అన్ని ఇచ్చినందుకు సాయిరాం కి ధన్యవాదాలు అని తెలిపింది. దీంతో తులసి ఇకపై సినిమాల్లో కనిపించదని, సినిమాలకు రిటైర్మెంట్ అధికారికంగా ప్రకటించిందని తెలుస్తుంది. ఇకపై తన జీవితం సాయి బాబా సేవలో గడిపి ఆయనకే అంకితం ఇస్తుందని తెలుస్తుంది. దీంతో మంచి ఆర్టిస్ట్ ని మిస్ అవుతాం అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Suma Kanakala : రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..