Senior Heros : ఏజ్ గ్యాప్ ఉన్నా.. ఈ సీనియర్ హీరోలందరికీ కుర్ర భామలే కావాలంట..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లైపోయిందంటే వదిన క్యారెక్టర్లకో, అక్క క్యారెక్టర్లకో ఫిక్స్ చేసేస్తారు. కానీ హీరోలు మాత్రం వాళ్లకు పెళ్లై, పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నా కూడా ఇంకా హీరోల కింద కన్సిడర్ చెయ్యాల్సిందే. 50 ప్లస్ హీరోలు తమకంటే 30 ఏళ్లు చిన్నవాళ్లైన................

Senior Heros pair up with young heroins

Senior Heros : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లైపోయిందంటే వదిన క్యారెక్టర్లకో, అక్క క్యారెక్టర్లకో ఫిక్స్ చేసేస్తారు. కానీ హీరోలు మాత్రం వాళ్లకు పెళ్లై, పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నా కూడా ఇంకా హీరోల కింద కన్సిడర్ చెయ్యాల్సిందే. 50 ప్లస్ హీరోలు తమకంటే 30 ఏళ్లు చిన్నవాళ్లైన యంగ్ హీరోయిన్లతో లవ్ ట్రాక్ లు నడుపుతున్నారు. ఏజ్ ఎక్కువైతే మాత్రం ఏంటీ అంటూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని బాగానే వర్కవుట్ చేస్తున్నారు. 50 ప్లస్ అయినా సరే మేం మాత్రం ఎవర్ యంగ్ అంటూ యంగ్ హీరోయిన్లతోనే ఎంగేజ్ అవుతున్నారు.

67 ఏళ్ల సీనియర్ హీరో చిరంజీవి కూడా యంగ్ హీరోయిన్లతో జత కట్టక తప్పడం లేదు. తన ఏజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్లు లేకపోవడంతో తనకంటే 30ఏళ్లు చిన్న వాళ్లైన హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెం.150లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి వాల్తేరు వీరయ్యలో తనకంటే 30 ఏళ్ళు చిన్నదైన శృతిహాసన్ తో రొమాన్స్ చేస్తున్నారు. మరో అప్ కమింగ్ మూవీ భోళాశంకర్ లో తనకంటే 35 ఏళ్లు చిన్నదైన తమన్నాతో హీరోగా చేస్తున్నారు.

టాలీవుడ్ మన్మధుడు 63 ఏళ్ల నాగార్జున చాలా వరకు తన సినిమాలు యంగ్ హీరోయిన్లతోనే చేస్తారు. 60 ప్లస్ లో ఉన్నా రొమాన్స్ డోస్ ఎక్కువున్న సీన్స్ చెయ్యడానికి ఏమాత్రం హెజిటేట్ చెయ్యని ఈ సీనియర్ హీరో ఇంకా యంగ్ హీరోయిన్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొన్నీమధ్య నాగార్జున చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఘోస్ట్ మూవీ లో తనకంటే 27 ఏళ్లు చిన్నదైన సోనల్ చౌహాన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో హీటెక్కించారు.

సిక్స్ టీ ప్లస్ సీనియర్ హీరో వెంకటేష్ అటు కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తూ మరో వైపు తనకంటే వయసులో చాలా చిన్నవాళ్లైన హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఎఫ్3 లో తనకంటే దాదాపు 30 ఏళ్లు చిన్న అయిన తమన్నా తో నటించారు.

మిగతా సీనియర్ హీరోలందరికీ ఒకలెక్క అయితే బాలకృష్ణది ఒక లెక్క. బాలకృష్ణ ఇంకా సోలో గానే సినిమాలు చేస్తున్నారు కాబట్టి 62 ఏళ్ల ఈ సాలిడ్ హీరోకి కూడా యంగ్ హీరోయిన్లే ఆప్షన్ అవుతున్నారు. ఇటీవల అఖండ సినిమాలో తనకన్నా 31 ఏళ్ళు చిన్న అయిన ప్రగ్యాతో జత కట్టి ఆది పాడారు. బాలయ్య గోపీచంద్ మలినేనితో చేస్తున్న మూవీలో తనకంటే పాతికేళ్లు చిన్నదైన శృతిహాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. హీరోయిన్ ఎవరైనా సరే తన మార్క్ కాంబినేషన్లో ఆన్ స్క్రీన్ ఫైర్ చేస్తుంటారు బాలయ్య బాబు.

షష్టిపూర్తి హీరోలే యంగ్ హీరోయిన్స్ తో చేస్తుంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్న హీరోలు కూడా మాకేం తక్కువ అంటున్నారు. వీళ్లలో రవితేజ మెయిన్. ఈ మధ్య తన అప్ కమింగ్ మూవీస్ అన్నింటిలో యంగ్ హీరోయిన్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 54 ఏళ్ల రవితేజ. ఖిలాడి సినిమాలో తనకంటే 30ఏళ్లు చిన్న వాళ్లైన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో జతకట్టారు. రామారావ్ ఆన్ డ్యూటీ లో తనకంటే 30 ఏళ్లు చిన్నదైన దివ్యాన్ష కౌషిక్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లేటెస్ట్ గా మరో మూవీ ధమాకాలో తనకంటే 33 ఏళ్ల చిన్నదైన శ్రీలీలతో డ్యూయోట్లేసుకుంటున్నారు. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నాకూడా ఏమాత్రం హెజేటేట్ చెయ్యకుండా స్క్రీన్ మీద కెమిస్ట్రీ పండిస్తున్నారు రవితేజ.

Movie Shootings : షూటింగ్స్ తో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్లు.. ఏ షూటింగ్ ఎక్కడో తెలుసా??

లుక్ వైజ్, చార్మింగ్ వైజ్ పవన్ కళ్యాణ్ ఇంకా సీనియర్ హీరో కాకపోయినా ఏజ్ వైజ్ హాఫ్ సెంచరీ కొట్టేశారు. 51 ఏళ్ళ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సెట్స్ మీదున్న హరిహరవీరమల్లు లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా సెట్ చేసుకున్నారు. హరీష్ శంకర్ తో చెయ్యబోతున్న మరో అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో తనకంటే 20 ఏళ్లు చిన్నదైన పూజాహెగ్డే తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఇలా 50 దాటినా హీరోలు కూడా యంగ్ హీరోయిన్స్ తోనే స్క్రీన్ షేర్ చేస్తూ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.