Senior NTR calls Mahanati Savitri as Savitramma NTR 100 Years
100 Years of NTR : తెలుగు తెర పై ఎంతో మంది గొప్ప నటులు ఉద్భవించారు. అయితే వారందిరిలో మహానటుడు నందమూరి తారక రామారావుకి (NT Rama Rao) తెలుగు వారి మదిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. నటుడిగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనిపించుకున్న ఎన్టీఆర్.. రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఎన్టీఆర్ తిరుగు లేదని అనిపించుకున్నారు. ఇక సినిమా ప్రపంచంలో ఎంతో కీర్తిని సంపాదించుకున్న ఎన్టీఆర్.. తోటి నటీనటుల ఎలా ఉండేవారో తెలుసా?
NTR 100 Years : ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ‘అమ్మ’ అని పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా?
సినిమా కోసం పని చేసే ప్రతి వ్యక్తితో ఎన్టీఆర్ చాలా మర్యాదపూర్వకంగా ఉండేవారట. అంతేకాదు వారితో మంచి అనుబంధాన్ని కూడా ఏర్పరచుకునేవారట. ఈ క్రమంలోనే మహానటి సావిత్రిని సోదరిగా చూసేవారట. ఆమెను ‘సావిత్రమ్మ’ అంటూ ప్రేమగా పిలిచేవారట. ఎన్టీఆర్, సావిత్రి చాలా సినిమాల్లో హీరోహీరోయిన్ గా నటించారు. గుండమ్మ కథ, మిస్సమ్మ, పాండవ వనవాసం, అప్పు చేసి పప్పుకూడు.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ అందర్నీ ఆకట్టుకుంది.
NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?
కాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ (Balakrishna) మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం మొత్తం ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా టెక్సాస్, ఖతార్ దోహా వంటి దేశాల్లో ఈ ఉత్సవాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ నెల 28న శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.