×
Ad

Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే.. ఆఖరి వారం గట్టి పోటీనే ఉందిగా..

ఈ వారం మంచి సినిమాలే ఉన్నాయి. రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఉంటే ఇంకో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.

  • Published On : September 25, 2023 / 01:52 PM IST

September Last Week Theatrical Releasing Movies in Telugu

Theatrical Movies : గత వారం ఒక్క తెలుగు డైరెక్ట్ సినిమా కూడా లేదు. ఏవో రెండు, మూడు చిన్న సినిమాలు తప్ప. కన్నడ డబ్బింగ్ సప్త సాగరాలు దాటి సినిమా ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమా ఉంది. దీంతో తెలుగు ప్రేక్షకులు జవాన్(Jawan), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) తర్వాత సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారం మంచి సినిమాలే ఉన్నాయి. రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఉంటే ఇంకో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద(Skanda) సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రామ్ పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయాడు ఈ సినిమా కోసం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన సినిమా పెదకాపు 1(Peddha Kapu 1). ఈ సినిమాలో అనసూయ, బ్రిగిడ, రావు రమేష్.. పలువురు ముఖ్య పాత్రలు చేస్తుండగా ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విలన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతుంది.

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పెద్ద హిట్ కొట్టిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’(The Vaccine War). కరోనా సమయంలో ప్రపంచం ఎదురుకున్న సమస్యలను, భారత్ చేసిన పోరాటం, వ్యాక్సిన్ కనుక్కోవడం వంటి అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. నానా పాటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ.. పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటించారు. ది వ్యాక్సిన్ వార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.


రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut), మహిమా నంబియార్ ముఖ్య పాత్రల్లో ఒకప్పటి రజినీకాంత్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి 2(Chandramukhi 2) సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై తమిళ్, తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి.