Drunk & Drive : డ్రంక్ & డ్రైవ్ లో పోలీసులు ఆపితే కార్ వదిలేసి పారిపోయిన నటుడు.. తెల్లారి పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే..

తాజాగా ఓ నటుడు తన కెరీర్ ఆరంభంలో డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లో ఆపితే కార్ వదిలేసి పారిపోయానని అప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్పాడు.

Drunk & Drive

Drunk & Drive : తాగి డ్రైవ్ చేయడం చట్ట ప్రకారం తప్పు. అది యాక్సిడెంట్స్ కి కారణం అవుతుంది కూడా. డ్రంక్ & డ్రైవ్ కేసులు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అందుకే పోలీసులు సైతం దీనిపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ లాంటి సిటీలలో రెగ్యులర్ గా డ్రంక్ & డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. తాజాగా ఓ నటుడు తన కెరీర్ ఆరంభంలో డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లో ఆపితే కార్ వదిలేసి పారిపోయానని అప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్పాడు.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అమర్ దీప్. బిగ్ బాస్ లో పాల్గొని మరింత వైరల్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ దీప్ ఈ విషయాన్ని తెలిపాడు.

Also Read : War 2 : వార్ 2 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లు..? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..

అమర్ దీప్ మాట్లాడుతూ..నా కెరీర్ మొదట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాను. నేను తాగి కార్ లో వెళ్తున్నాను. పోలీసులు పట్టుకున్నారు. దిగి పక్కన నించున్నాను. అప్పటికి నాకు అంత ఫేమ్ లేదు. ఏదో చిన్న చిన్నవి చేసుకుంటున్నాను నటుడిగా. అప్పుడే ఆ డ్రంక్ & డ్రైవ్ దగ్గరకు మీడియా వాళ్ళు వచ్చారు. మీడియాకు కనపడకూడదు అని కార్ అక్కడే వదిలేసి సైలెంట్ గా పారిపోయాను.

నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ఆ కార్ నెంబర్ తో నా ఫోన్ నెంబర్ పట్టుకొని కాల్ చేసారు. నేను మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేసాను సర్, నైట్ మా ఇంట్లో బదులు పక్కింట్లో పడుకున్నాను సర్, వాళ్ళు ఇప్పుడే లేపి పంపించారు, నాకేం గుర్తులేదు అని వాళ్లకు కొన్ని కథలు చెప్పి స్టేషన్ కి వెళ్లి ఫైన్ కట్టి కార్ తెచ్చుకున్నాను అని తెలిపాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు తాగి డ్రైవ్ చేయలేదని, ఒకవేళ తాగితే డ్రైవ్ చేయడానికి పక్కన ఎవరో ఒకరు ఉంటారని చెప్పాడు అమర్ దీప్.

Also Read : Coolie – War 2 : రెండు సినిమాల అడ్వాన్స్ సేల్స్ ఎన్ని కోట్లు తెలుసా? కూలీకి దరిదాపుల్లో కూడా లేని వార్ 2..