Serial Actress
Serial Actress : సినీ పరిశ్రమలో కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ అనే మాటలు అప్పుడప్పుడు వినిపిస్తునే ఉంటాయి. పలువురు హీరోయిన్స్, నటీమణులు తాము కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసాము అని చెప్తూ ఉంటారు. తాజాగా ఓ నటి తనని కమిట్మెంట్ అడిగారని తాను ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది.(Serial Actress)
జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది ఐశ్వర్య ఉల్లింగల. కానీ సీరియల్స్ తోనే ఎంట్రీ ఇచ్చింది ఈ ఫీల్డ్ లోకి. కాంచనమాల, భాగ్యరేఖ, చిట్టితల్లి, రామచక్కని సీత సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకోగా బయట ఈవెంట్స్ చేస్తూ జబర్దస్త్, శ్రేదేవి డ్రామా కంపెనీ షోలతో బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది.
Also Read : OG Success Meet : దసరా స్పెషల్.. OG సక్సెస్ మీట్.. పవర్ స్టార్ కూడా.. ఫ్యాన్స్ కి పండగే..
ఐశ్వర్య ఉల్లింగల మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగారు. నాకు కమిట్మెంట్ అంటే అప్పటికి ఇంకా తెలీదు. ఒక డైరెక్టర్ అలా అడిగితే.. నేను కమిట్మెంట్ గానే వర్క్ చేస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పాను. అది కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. దాంతో నాకు అర్థమయి ఆ డైరెక్టర్ ని అక్కడే కొట్టి బయటకు వచ్చేసాను. ఆ డైరెక్టర్ పేరు అడగొద్దు, చెప్పను. పెద్ద డైరెక్టర్ కాదు కానీ కొంచెం తెలిసిన వాడే. తర్వాత కాల్స్ లో చాలా మంది అడిగారు. మొదట సినిమాలో ఛాన్స్ కి ఓకే చెప్పి అగ్రిమెంట్ చేసుకునే ముందు కాల్ చేసి కమిట్మెంట్ గురించి ఇండైరెక్ట్ గా అడిగేవాళ్ళు. నేను నో చెప్పేదాన్ని అని తాను ఫేస్ చేసిన సంఘటనలను తెలిపింది.
Also See : Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి క్యూట్ వర్కింగ్ స్టిల్స్.. ‘తెలుసు కదా’ సినిమా నుంచి..