Jabardasth Praveen : నువ్వు యాక్టర్ కాదా..? జబర్దస్త్ కమెడియన్ ని అందరి ముందు అవమానించిన డైరెక్టర్..

తాజాగా ప్రవీణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఓ షూట్ లో ఎదుర్కున్న అవమానం గురించి తెలిపాడు. (Praveen)

  • Updated on- May 18, 2026 / 06:21 PM IST

Serial Director Insults Jabardasth Comedian Praveen

Praveen Jabardasth: పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలతో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే వంశిత అనే నటి, డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్. తాజాగా ప్రవీణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఓ షూట్ లో ఎదుర్కున్న అవమానం గురించి తెలిపాడు.

Also Read : Praveen : సన్నాఫ్ సత్యమూర్తి సీన్ రిపీట్.. నాన్న చనిపోయాక చెడ్డపేరు రావొద్దని.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్..

ప్రవీణ్ మాట్లాడుతూ.. ఒక సీరియల్ షూట్ కి వెళ్ళా. డైరెక్టర్, మేనేజర్ అందరూ బాగానే మాట్లాడారు. ఒక కో డైరెక్టర్ నన్ను అవమానపరిచాడు. ఆర్టిస్టుకు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా లేదు. పేపర్ ఇచ్చి చెయ్యి అన్నారు. చేస్తే ఏమి చెప్పకుండానే అలా ఎందుకు చేస్తావ్ అని తిట్టాడు. అసలు నేను వచ్చి ఛాన్స్ అడగలేదు. వాళ్ళే వచ్చి ఛాన్స్ ఇచ్చారు. అప్పటికి నేను సీరియల్ అలవాటు లేదు నేను చేయను అన్నాను.

షూటింగ్ లో నాకు సీరియల్ కొత్త సర్ అని చెపితే నీకు యాక్టింగ్ రాదా? నువ్వు యాక్టర్ కావా అని అందరిముందు అన్నారు. నన్ను పది మంది ముందు అవమానపరిచే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? కొత్తగా వచ్చినవాళ్ళకు చెప్పాలి కదా. అదే డైరెక్టర్ ని వచ్చి మా షోని చేయమనండి. అప్పటికి పది సార్లు చేసాను సీన్. మినిమమ్ బిహేవియర్ లేదు. నేను కొన్ని సినిమాలు కూడా చేశా. ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు. కానీ అందరిముందు తిట్టేసరికి వెంటనే మేనేజర్, డైరెక్టర్ కి చెప్పేసి నేను చేయను అని వెళ్లిపోయానని తెలిపాడు.