బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో తమిళ దర్శకుడు అట్లీ సినిమా.. అట్లీ దళపతి విజయ్‌తో చేసిన హ్యట్రిక్ ఫిలిం ‘బిగిల్’ దీపావళికి భారీగా విడుదల కానుంది..
‘రాజారాణి’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమై.. ‘తేరి’ (పోలీసోడు), ‘మెర్సల్’ (అదిరింది) వంటి కమర్షియల్ సినిమాలతో తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు యంగ్ డైరెక్టర్ అట్లీ. తేరీ, మెర్సల్ తర్వాత దళపతి విజయ్‌తో చేసిన హ్యట్రిక్ ఫిలిం ‘బిగిల్’ దీపావళికి భారీగా విడుదల కానుంది.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబడుతుంది. ఇదిలాఉంటే అట్లీ తన తర్వాతి సినిమాను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో చెయ్యనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Read Also : ‘వసంతకాలం’ భయపెడుతుంది
డిసెంబర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ప్రారంభం అవుతుందని కోలీవుడ్ టాక్. షారూఖ్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించడానికి అట్లీ ప్లాన్ చేశాడని కాస్త గట్టిగానే వార్తలు వినపడుతున్నాయి. ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది.