Shah Rukh Khan : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో.. స్టార్ సింగర్ టీ కప్ మోస్తూ కనిపించిన షారుఖ్..

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్టార్ సింగర్ ఆశా భోంస్లే తాగిన టీ కప్ ని తీస్తూ కనిపించిన షారుఖ్ ఖాన్.

Shah Rukh Khan Asha Bhosle video at ODI World Cup 2023 gone viral

Shah Rukh Khan : అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పోరు జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా జట్టులు ప్రపంచ ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో.. భారత్ జట్టు మొదటి బ్యాటింగ్ కి దిగి భారీ స్కోర్ ఇచ్చేందుకు బరిలో పోరాడుతున్నారు. 2003 ఫైనల్ మ్యాచ్ లో భారత్ ని ఓడించి ట్రోఫీ గెలుచుకున్న ఆస్ట్రేలియాకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ఇండియన్ మ్యాచ్ చూడడంలో నిమగ్నమయ్యారు.

ఇక ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్టేడియంకి చేరుకున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా, ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, వెంకటేష్, మహేష్ బాబు, అఖిల్ అక్కినేని, దీపికా పదుకొనె.. తదితరులు మ్యాచ్ కి హాజరయ్యి స్టేడియంలో ఆడియన్స్ తో కలిసి సందడి చేస్తున్నారు. వీరందరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీటిలో షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.

Also read : World Cup final : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..

ఆ వీడియోలో షారుఖ్.. ఆశా భోంస్లే తాగిన టీ కప్ ని తీస్తూ కనిపించారు. స్టేడియంలో విఐపి సెక్షన్ లో షారుఖ్, ఆశా భోంస్లే పక్క పక్కన కూర్చొని మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. మ్యాచ్ చూస్తూ ఒక కప్ టీని ఆస్వాదించిన ఆశా భోంస్లే.. టీ తాగిన అనంతరం ఆ కప్ ని ఎక్కడ పెట్టాలో తెలియక చేతిలోనే పట్టుకొని కూర్చున్నారు. ఇక ఇది గమనించిన షారుఖ్ ఆమె చేతిలో నుంచి ఆ కప్ ని తీసుకోని దానిని స్టేడియం స్టాఫ్ కి అందిస్తూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పెద్దల వద్ద షారుఖ్ వ్యవహరించిన తీరు పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.