Jawan Collections : బాక్సాఫీస్ వద్ద తగ్గుతున్న జవాన్ కలెక్షన్స్.. 1000 కోట్లు కష్టమేనా..?
మొదటి నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన జవాన్.. ఇప్పుడు కలెక్షన్స్ రాబట్టడంలో వెనుకబడింది.
- gum 95921
- Published On : September 13, 2023 / 03:13 PM IST
Shah Rukh Khan Jawan Collections is falling down
Jawan Collections : షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్’ మొదటి నాలుగు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటి రోజే రూ.129 కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. రోజుకో 100 కోట్ల చొప్పున నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్ల పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ మూవీ స్పీడ్ చూసి 1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి పెద్దగా సమయం పట్టదు అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ చూస్తుంటే.. ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Hanuaman : ‘హనుమాన్’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. వినాయక చవితి నుంచి..
మొదటిరోజు రూ.125 కోట్లు, సెకండ్ డే రూ.109 కోట్లు, మూడోరోజు రూ.140 కోట్లు, నాలుగో రోజు రూ.150 కోట్లు కలెక్షన్స్ ని రాబట్టింది. ఇలా మొదటి వీకెండ్ లో అదిరిపోయే కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ.. సోమవారం నుంచి కలెక్షన్స్ రాబట్టడంలో వెనుకబడింది. సోమవారం నాడు రూ.52 కోట్ల, మంగళవారం నాడు రూ.38 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఈ కలెక్షన్స్ ఇలా తగ్గుతూనే వెళ్తే 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ వీక్ బాలీవుడ్ లో మరో పెద్ద మూవీ రిలీజ్ లేనప్పటికీ.. సౌత్ లో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం విడుదల కాబోతుంది.
Bigg Boss : బిగ్‌బాస్ హౌస్‌లో ఆ వాయిస్ ఎవరిది? బిగ్‌బాస్‌లా మాట్లాడే పర్సన్ ఎవరో తెలుసా?
మరి జవాన్ ఈ వీకెండ్ లో ఏమన్నా కలెక్షన్స్ రేంజ్ పెంచుకుంటుందా..? లేదా..? చూడాలి. కాగా గతంలో పఠాన్ సినిమాకి కూడా ఇలానే అయ్యింది. మొదటిలో 100 కోట్లు తెచ్చిపెట్టిన మూవీ.. ఆ తరువాత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో మేకర్స్ టికెట్ రేట్స్ తగ్గించి పలు ఆఫర్లు పెట్టి.. మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి తీసుకు వెళ్లరు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా అలానే తీసుకు వెళ్తారేమో చూడాలి.
Jawan WW Box Office
ENTERS ₹600 cr gross club in just 6 days.
Fastest for baadshah of bollywood.
The film continues to hold well even on working days.
||#Jawan|#ShahRukhKhan|#Nayanthara||
Day 1 – ₹ 125.05 cr
Day 2 – ₹ 109.24 cr
Day 3 – ₹ 140.17 cr
Day 4 – ₹ 156.80 cr… pic.twitter.com/aM1ZhS4stR— Manobala Vijayabalan (@ManobalaV) September 13, 2023
