Jawan Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తున్న జవాన్.. మూడు రోజుల్లో..!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన 'జవాన్' బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

Shah Rukh Khan Jawan three days Collections world wide

Jawan Collections : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్’ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సెప్టెంబర్ 7న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా అంతకుమించి ఉండడంతో థియేటర్స్ లో హౌస్ ఫుల్ షోలు నమోదు అవుతున్నాయి. మొదటి రోజే ఈ చిత్రం రూ.129 కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక రెండో రోజు శుక్రవారం నాడు సుమారు 70 కోట్లు అందుకొని 200 కోట్లకు పైగా కలెక్షన్స్ నే రాబట్టింది.

Prabhas : పౌరాణిక పాత్రల్లో ప్రభాస్.. ఇప్పటికే విశ్వామిత్ర, రాముడు, కృష్ణుడు.. త్వరలో శివుడు, విష్ణువు..?

ఇక మూడోరోజు శనివారం వీకెండ్ కావడంతో.. ఏకంగా 150 కోట్లు వాసులు చేసింది. దీంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే.. ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి పెద్ద సమయం పట్టేలా లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే పఠాన్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. జవాన్ కూడా ఆ మార్క్ ని అందుకుంటే.. 1000 కోట్ల క్లబ్ లో రెండు చిత్రాలు ఉన్న హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు.

Virinchi Varma : లవ్ సినిమాల డైరెక్టర్.. ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ డ్రామాతో.. జితేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ విడుదల..

కాగా ఈ సినిమాని తమిళ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.