Shah Rukh Khan : ‘మన్నత్’ ని వదిలి వెళ్ళిపోతున్న షారుఖ్.. నిరాశలో ఫ్యాన్స్.. ఇకపై ముంబై వెళ్తే షారుఖ్ ఫ్యాన్స్ కి కష్టమే..

'మన్నత్' అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ మన్నత్ అంటే ప్రతి షారుఖ్ ఫ్యాన్ కి, ముంబైలో ఉండే అందరికి తెలుసు.

Shah Rukh Khan Leaves Mannat For Some Months Fans Disappointed

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ కొన్నాళ్ళు ఫ్లాప్స్ లో ఉన్నా 2023 లో పఠాన్, జవాన్, డుంకి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ పని అయిపోయింది అన్నవాళ్లకు తన సినిమాలతోనే గట్టిగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఓ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా షారుఖ్ ఫ్యాన్స్ కి ఓ చేదు వార్త అంటూ ఒక న్యూస్ బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

‘మన్నత్’ అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ మన్నత్ అంటే ప్రతి షారుఖ్ ఫ్యాన్ కి, ముంబైలో ఉండే అందరికి తెలుసు. ఇంతకీ మన్నత్ అంటే ఏంటో అనుకుంటున్నారా. షారుఖ్ ఖాన్ నివసించే ఇంటి పేరు. ముంబైలో కొత్తవాళ్ళైనా సరే ఆటో ఎక్కి మన్నత్ అంటే తీసుకెళ్ళిపోతారు. ముంబైలో అంత ఫేమస్ షారుఖ్ ఇల్లు మన్నత్. షారుఖ్ ఫ్యాన్స్ ఎవరైనా ముంబై వస్తే కచ్చితంగా మన్నత్ ఇంటి ముందు ఫోటో దిగి వెళ్తారు. ముంబైలో అది ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఎప్పుడూ అక్కడ జనాలు, ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు. షారుఖ్ తన ఇల్లు మన్నత్ నుంచే ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ ఉంటాడు. మన్నత్ అని తన ఇంటి పేరుని డైమండ్స్ నేమ్ బోర్డు తో కూడా చేయించి గతంలో బిల్డింగ్ బయట పెట్టాడు.

Also Read : Bandhavi Sridhar : తండేల్ సక్సెస్ పార్టీలో తళుక్కుమని మెరిపించిన ఈ భామ ఎవరో తెలుసా? చైతూ, తేజుతో ఫోటోలు దిగి వైరల్..

అయితే గత రెండు దశాబ్దాలుగా షారుఖ్ మన్నత్ కి ఫ్యాన్స్ కి ఉన్న బంధం కొన్ని రోజులు తెగనుంది. మన్నత్ రీ ఇన్నోవేషన్ కోసం షారుఖ్ తన ఫ్యామిలీతో కలిసి కొన్ని నెలల పాటు ఆ ఇంటిని ఖాళీ చేయనున్నాడట. ఈ మేరకు బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మన్నత్ ఎప్పుడో 1914లో కట్టారు. 1997లో ఓ సినిమా కోసం షారుఖ్ అందులో షూట్ చేసారు. ఆ ఇల్లు బాగా నచ్చడంతో 2001లో షారుఖ్ దాన్ని కొనుక్కొని మన్నత్ గా పేరు మార్చి అందులో నివాసం ఉంటున్నాడు.

ఈ రెండు దశాబ్దాలుగా షారుఖ్ కి మన్నత్ కి ఫ్యాన్స్ కి మంచి అనుబంధం ఏరపడింది. ఇల్లు కట్టి చాన్నాళ్లు అవ్వడం రీ ఇన్నోవేషన్ చేయించి కూడా 20 ఏళ్ళు అవుతుండటంతో ఆ ఇంటిని షారుఖ్ మరింత కొత్తగా రీ ఇన్నోవేట్ చేయిస్తున్నాడట. అందుకే కొన్ని నెలల పాటు ఫ్యామిలీతో కలిసి వేరే చోట ఉండబోతున్నాడట. ముంబైలోని లగ్జరీ ఏరియా బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ కి షారుఖ్ షిఫ్ట్ అవుతున్నాడని సమాచారం. ఆ అపార్ట్మెంట్ రకుల్ రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీది అని తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ రెంట్ కోసం షారుఖ్ భారీ మొత్తమే చెల్లిస్తున్నట్టు టాక్.

Also Read : Prabhas : ఇదెక్కడి మాస్ రా బాబు.. ఆ దేశంలో ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు.. అదిరింది డార్లింగ్ అంటున్న ఫ్యాన్స్..

దీంతో షారుఖ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కొన్ని రోజుల పాటు షారుఖ్ ని చూడలేమా, మన్నత్ తో ఫోటోలు దిగలేమా, షారుఖ్ ఎక్కడికో అపార్ట్మెంట్స్ లోకి వెళ్తే కనిపించడు, ఇదివరకులా ఫ్యాన్స్ కి అభివాదం చేయడు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.