Shah Rukh Khan
Shah Rukh Khan: బాలీవుడ్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందంటే అందులో షారుక్ అయినా ఉండాలి లేక సెక్స్ అయినా ఉండాలనే ఓ పేరు ఉండేది. షారుక్ సినిమా వస్తుంటే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. అందుకే ఆయనకు బాలీవుడ్ బాద్ షా అని పేరు. అయితే అదంతా గతం. ఇప్పుడు షారుఖ్ సినిమాలలో పస తగ్గింది. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత షారుక్ సినిమాలలో ఒక్కటీ సక్సెస్ దక్కించుకోలేదు. వరసగా పది సినిమాలు ఫట్ మనడంతో షారుక్ ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.
షారుక్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మూడేళ్ళ నుండి ఒక్క సినిమా విడుదల కాలేదు. కథా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న షారుక్ తమిళ దర్శకుడు అట్లీకి సై అన్నాడు. అట్లీ ఈ సినిమాను షారుక్ క్రేజ్ కు తగ్గట్లే ప్లాన్ చేస్తూనే మరోవైపు తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా దక్షణాది నటులనే అధికంగా తీసుకోగా ఆ సినిమాకు ఇక్కడ కూడా ప్లస్ అయింది. షారుక్, దీపికా పదుకొనే హిందీ పరిశ్రమకు అడ్వాంటేజ్ కాగా మిగతా వారంతా సౌత్ ఇండస్ట్రీ నుండే తీసుకున్నారు.
సరిగ్గా ఇప్పుడు అట్లీ కూడా అదే ఫార్ములాను ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తుంది. ఈసారి ఏకంగా హీరోయిన్ ను కూడా ఇక్కడ నుండే తీసుకున్నాడు. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా మారిన నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా మిగతా నటీనటులు కూడా ఇక్కడి వాళ్ళే నటిస్తున్నారు. షారుక్ కూడా అట్లీ కథ నచ్చడంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడంతో సినిమాను దక్షణాది నటులతోనే నింపేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా, ఈ సినిమా సక్సెస్ కొడితే అటు షారుక్ కమ్ బ్యాక్ తో పాటు అట్లీ బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ఉపయోగపడనుంది.