Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో కనిపించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ పిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమాను స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
Pathaan : సంక్రాంతి నుంచి పడిపోతున్న PVR స్టాక్ ప్రైజ్.. పఠాన్ దెబ్బతో మళ్ళీ ఫామ్ లోకి..
ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా, అన్ని చోట్లా ఈ సినిమాకు మంచి టాక్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసింది చిత్ర యూనిట్. పఠాన్ సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్‌లో ఈమేరకు డిజిటల్ పార్ట్నర్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందనే విషయాన్ని అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.
ఇక పఠాన్ సినిమా బాలీవుడ్‌కు మంచి బూస్ట్ ఇవ్వడం ఖాయమని పలువురు సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ రూపంలో భారీగా కలెక్షన్స్ సాధిస్తుందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోండగా, బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో నటించాడు.