Pathaan : రిలీజ్ కి ముందే 50 కోట్ల వసూళ్లు.. ఇక రిలీజయితే.. 100 దేశాల్లో షారుఖ్ కంబ్యాక్ మూవీ విడుదల..
పఠాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ నాలుగు రోజుల ముందే ఓపెన్ చేయడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. షారుఖ్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో..............

Pathaan movie creates new record in pre sales collects 50 crores in advance bookings
Pathaan : షారుఖ్ ఖాన్ వెండితెరపై కనపడి నాలుగేళ్లు దాటేసింది. చివరి సినిమా జీరో పరాజయం పాలయింది. షారుఖ్ సినిమా కోసం అభిమానులతో పాటు బాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నాడు షారుఖ్. షారుఖ్, దీపికా పదుకొనే జంటగా, జాన్ అబ్రహం విలన్ గా యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ యాక్షన్ సినిమా పఠాన్. జనవరి 25న పఠాన్ సినిమా పాన్ ఇండియా సినిమాగా సౌత్ భాషల్లో కూడా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే పఠాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ నాలుగు రోజుల ముందే ఓపెన్ చేయడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. షారుఖ్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతోనే లక్షల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. పఠాన్ సినిమాని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒక ఇండియన్ సినిమాకి ఇదే ఎక్కువ రిలీజ్.
James Cameron : ఆ రికార్డు సాధించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక్కడే..
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే 50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయట. బాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం మొదటి రోజుకి 23 కోట్లకు పైగా, రెండవ రోజుకి 13 కోట్లకు పైగా, నాలుగో రోజుకి 14 కోట్లకి పైగా బుకింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి. అడ్వాన్స్ లోనే ఈ రేంజ్ లో దాదాపు 50 కోట్లకు పైగా కలేకూరి చేసిందంటే మొదటి రోజు షోల అనంతరం కచ్చితంగా 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే PVR, INOX, సినీపోలిస్ లాంటి మల్టీప్లెక్స్ లలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 4.19 లక్షల టిక్కెట్‌లు అడ్వాన్స్ సేల్ అవ్వడం విశేషం. ఇక విదేశాల్లో కూడా షారుఖ్ కి ఉన్న క్రేజ్ తో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. షారుఖ్ తో పాటు అతని అభిమానులు కూడా పఠాన్ సినిమా భారీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
TOP 5
Ticket Sales Of *Day 1*… #Hindi and #Hindi dubbed films…
NOTE: National chains only.1. #Baahubali2 #Hindi 6.50 lacs
2. #KGF2 #Hindi 5.15 lacs
3. #Pathaan 4.19 lacs* [1 day pending]
4. #War 4.10 lacs
5. #TOH 3.46 lacs pic.twitter.com/JzUmqbVRPK— taran adarsh (@taran_adarsh) January 23, 2023